పుష్ప విలన్.. ఎప్పుడైనా నమ్మొచ్చా

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న బిగెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి కూడా గాసిప్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రూమర్లు ఎన్ని పుట్టుకొస్తున్నా కూడా చిత్ర యూనిట్ ఒక్కసారి కూడా వివరణ ఇవ్వకపోవడం ఆశ్చర్యం. ఇక సినిమాలో అతి ముఖ్యమైన విలన్ పాత్రపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. దర్శకుడు సుకుమార్ ఎలాంటి విలన్ ను సెలెక్ట్ చేసుకుంటాడు అనే ఊహ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తోంది.

అందుకేనేమో రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా క్లారిటీ ఇవ్వడం లేదని అనిపిస్తోంది. ఇక మొదట విజయ్ సేతుపతి నటించడానికి ఒప్పుకున్నప్పటికి డేట్స్ అడ్జస్ట్ చేయలేక డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత బాబీ సింహా, అరవింద్ స్వామి, చియాన్ విక్రమ్ వంటి వాళ్ళ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక ఆ రూమర్స్ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్న తరుణంలో మరొక ఇంట్రెస్టింగ్ రూమర్ హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ బాబీ డియోల్ మెయిన్ విలన్ గా సెలెక్ట్ అయినట్లు టాక్ వస్తోంది.

ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. మరి అప్పుడు ఎలాంటి వివరణ ఇస్తారో చూద్దాం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.