విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్న మరో సినిమా జంట!

అప్పటివరకూ టాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు అవుతున్నాయని మురిసిపోయిన ఇండస్ట్రీ పెద్దలు ఒక్కసారిగా షాక్ తిన్న విషయం క్రిష్-రమ్య వెలగల డివోర్స్ మేటర్. వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించేలోపే ఆ వార్త సోషల్ మీడియాలో నానా రచ్చ చేసింది. ఆ తర్వాత మంచు మనోజ్-ప్రణతిరెడ్డిల విషయం కూడా అంతే. మనోజ్ రీసెంట్ గా కన్ఫర్మ్ చేశాడు కానీ.. వాళ్ళకంటే ముందే న్యూస్ పేపర్స్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాయి. ఇక విశాల్-అనీషాలు ఎంగేజ్ మెంట్ అనంతరం పెళ్ళికి ముందే తమ బంధాన్ని విరమించుకొన్నారు. అఖిల్ మేటర్ లో జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

అయితే.. ఇప్పుడు వీరి బాటలోనే మరో ప్రముఖ సినిమా ప్రేమ జంట విడాకులు తీసుకోవడానికి సన్నద్ధమవుతోందట. ఓ ప్రముఖ సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లాడిన ఓ బిజినెస్ మ్యాన్ కు కొన్ని నెలలుగా భార్యతో పడడం లేదట. కానీ ఆ విషయాన్ని చర్చించడానికి కూడా అమ్మాయి కానీ అమ్మాయి తరుపువారు కానీ స్పందించకపోవడంతో.. వాళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. అప్పుడు ఆ ప్రముఖ సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయి ఎవరు అనే విషయంలో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.