అనిల్ అంతలా మహేష్ ని ఇంప్రెస్ చేశాడా..?

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు అంత త్వరగా ఏ సినిమాకి కమిట్ అవ్వడు. ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఇక దాన్ని ఎప్పటికైనా సరే చేసి తీరతాడు. ఇదే ఉద్దేశ్యంతో సుకుమార్ కథని వినిపించినా, పూరీ జగన్ వినిపించినా కాస్త గ్యాప్ తీస్కుని మరీ చేస్తాడనే ఫ్యాన్స్ కి నమ్మకం ఉంది. అయితే, రీసంట్ గా కొంతమంది దర్శకులతో సినిమాలని ఎనౌన్స్ చేసి కూడా మళ్లీ వాటిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇందులో వంశీపైడిపల్లి సినిమా కూడా ఉంది. మరి ఇది ఎప్పుడు కమిట్ అవుతాడు అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత ఇదే ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ అది పట్టాలెక్కలేదు. ఈలోగా పరుశురామ్ వచ్చి కథ చెప్పి డేట్స్ పట్టేశాడు.

ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా కథ చెప్పి బాగా ఇంప్రెస్ చేశాడట. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అని ఆరాతీస్తే అనిల్ రావిపూడి అని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ తో సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ ఆ తర్వాత మళ్లీ మహేష్ తో సినిమా చేస్తానని చెప్పాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా మహేష్ బాబు అనిల్ తో మరోసినిమా ఉంటుందని ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశాడు. అయితే, ఇప్పుడు ఇది మొదలు పెట్టాలని చూస్తున్నారట. సర్కారి వారి పాట సినిమా తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు రాజమౌళి తో సినిమా చేయాల్సి ఉంది. అయితే, మధ్యలో డేట్స్ ఉంటాయి కాబట్టి రెండు సినిమాలు చేయాలని చూస్తున్నాడని టాక్.

ఇందులో వెంకీ కుడుముల చెప్పిన కథ ఒకటైతే, అనిల్ రావిపూడి చెప్పిన కథ ఇంకొటి. ప్రస్తుతం ఎఫ్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి మహేష్ ని ఇంప్రెస్ చేసే కథ ఒకటి చెప్పి డేట్స్ లాక్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. మరి మహేష్ అంతలా ఇంప్రెస్ అయిన ఆ కథేంటి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఒక డిఫరెంట్ గెటప్ తోనే ఈసినిమా ఉంటుందని, ప్రయోగాత్మకమైన సినిమా చేయాలని మహేష్ ఎప్పట్నుంచో చూస్తున్నాడని మాత్రం సన్నిహిత వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.