ఒక్క పోస్ట్ తో రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టిన సుమ!

బుల్లితెర మహారాణిగా వెలుగొందుతోన్న యాంకర్ సుమ కనకాల తాజాగా తన భర్త రాజీవ్ కనకాలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. సుమకి, రాజీవ్ కి అసలు పడడం లేదని.. భర్తతో సుమ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వీటన్నింటినీ తిప్పికొడుతూ ఓ పోస్ట్ పెట్టింది సుమ. తన భర్తపై ప్రేమని కురిపిస్తూ వారిద్దరి బంధం పై సుమ చేసిన పోస్ట్ జనాల్లో ఉన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.

ఇరవై ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమా.. అప్పటినుండి తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. అయితే ఈ మధ్యకాలంలో సుమ దంపతుల గురించి రూమర్లు రావడంతో అందరూ షాకయ్యారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని సుమ పెట్టిన పోస్ట్ ద్వారా అర్ధమవుతోంది. ఈరోజు రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా.. అతనితో సరదాగా గడిపిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది సుమ.

నా ప్రియమైన రాజా.. అంటూ మొదలుపెట్టి నువ్వే నా బలం, నా సంతోషం , నా జీవితానికొక వరం అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు సుమ పెళ్లి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుసుకొని.. రాజీవ్ కి విషెస్ చెబుతున్నారు. నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన రాజీవ్ కనకాల రీసెంట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కనిపించారు.


Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Share.