సుధీర్ పై ప్రేమను బయటపెట్టిన యాంకర్ రష్మీ..?

బుల్లితెర జోడీగా పేరు తెచ్చుకున్న సుధీర్ రష్మీ జోడీ కలిసి చేసిన షోలు, ఈవెంట్లు సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ జోడీని అభిమానించే ఫ్యాన్స్ లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ జోడీకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని కొన్ని నెలల క్రితం ఒక ఛానెల్ నిర్వాహకులు సుధీర్ రష్మీ పెళ్లి పేరుతో ఒక ఈవెంట్ ను ప్రసారం చేయగా ఆ ఈవెంట్ కు మంచి రేటింగ్స్ వచ్చాయి. తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో సుధీర్ రష్మీ పెళ్లి ప్రస్తావన వచ్చింది.

సుధీర్ తో పెళ్లి ఇష్టమే అంటూ రష్మీ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ప్రోమోలో రాకేష్ మాస్టర్ సుడిగాలి సుధీర్ ను నువ్వు ఎవరినైనా ప్రేమించావా..? అని అడగగా రష్మీ తన వెంట పడుతోందని సుధీర్ సమాధానం ఇస్తాడు. రష్మీ రోజాతో నేను సుధీర్ వెంటపడ్డానా..? అని అడగగా ఎక్స్ట్రా జబర్దస్త్ నిర్వాహకులు సుధీర్ రష్మీ కలిసి చేసిన షోలు, ఈవెంట్లకు సంబంధించిన విజువల్స్ ను చూపించారు.

ఆ తరువాత రాకేష్ మాస్టర్ ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు కదా..? అని సుధీర్, రష్మీలకు చెబుతారు. ఆ ప్రశ్నకు సుధీర్ కొన్ని నెలల క్రితమే ఆహానా పెళ్లంట అనే ఈవెంట్ లో పెళ్లి గట్టిగా అయిందని జవాబిస్తాడు. ఆ తరువాత రాకేష్ మాస్టర్ రష్మీని సుధీర్ తో పెళ్లి ఇష్టమేనా అని అడగగా ఆమె సుధీర్ తో పెళ్లి ఇష్టమేనని బదులిస్తారు. సుధీర్ తనకు కూడా పెళ్లి ఇష్టమేనని చెప్పడంతో రాకేష్ మాస్టర్ సుధీర్ రష్మీ చేతులను ఒక్కటి చేశారు. ఈ శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.


వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Share.