ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను!

మేల్ యాంకర్స్ లో ప్రదీప్ ని ఢీ కొట్టేవారు లేరనడంలో అతిశయోక్తి లేదు. తన మాటలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రదీప్.. సినిమా ఫంక్షన్లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో ప్రదీప్ పెళ్లికి సంబంధించిన ఓ ఛానెల్ ఏకంగా ఓ షోని కూడా రన్ చేసిందంటే ప్రదీప్ కి ఉన్న క్రేజ్ గురించి అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ప్రదీప్ తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనలకు షేర్ చేసుకున్నాడు. యాంకర్ గా ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న తరువాత ప్రదీప్ ఓ వేడుకకు వెళ్లాడట.

అక్కడకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాగా.. ప్రదీప్ ను చూసిన ఆయన పేరు పెట్టి పిలిచారట. ‘మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు పలికే తెలుగు పదాల ఉచ్చారణ నాకెంతో నచ్చుతుంది’ అంటూ చిరు స్వయంగా ప్రదీప్ కి చెప్పారట. చిరంజీవి లాంటి లెజెండ్ తనను పేరు పెట్టి పిలవడం, తనను ప్రత్యేకంగా మెచ్చుకోవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అంటున్నాడు ప్రదీప్. ఆ క్షణం తను గడ్డకట్టుకుపోయానని, కొన్ని సెకెండ్ల పాటు శరీరం చల్లగా అయిపోయిందని చెప్పారు.

చిరంజీవి తనతో మాట్లాడుతుంటే అలాగే నిల్చుండిపోయానని.. ఆ సమయంలో కూర్చోండి అంటూ మెగాస్టార్ అనడం జీవితంలో మర్చిపోలేని అనుభవాలు అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్. ఇప్పటివరకు బుల్లితెరపై సందడి చేసిన ప్రదీప్.. త్వరలోనే వెండితెరపై ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాలో హీరోగా నటించాడు ప్రదీప్. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Share.