లాస్య లవ్ స్టోరీ ఇదే !

సంప్రదాయ దుస్తులతో బుల్లితెరలో సందడిచేసే యాంకర్ లాస్య త్వరలో ఓ ఇంటికి ఇల్లాలు కాబోతోంది. తాను ప్రేమించిన మంజునాథ్ అనే వ్యక్తి నే పెళ్లిచేసుకోబోతోంది. వీరిద్దరికి గతనెల వైభవంగా నిశ్చితార్ధం  జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన ఈ అబ్బాయితో లాస్య ప్రేమలో ఎలా పడిందో రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించింది. లాస్య ఇంజినీరింగ్ చదివే రోజుల్లో ఈ ప్రేమ కథ మొదలయింది. ఈ లవ్ స్టోరీ మొదలుకు మెహిదీపట్నం బస్టాప్ సాక్షి. అక్కడ లాస్యను చూసిన మంజునాథ్ ఫ్లాట్ అయిపోయాడు.

అప్పటి నుంచి ఆమెను రోజూ ఫాలో అయ్యాడు. లాస్య ఉంటున్న హాస్టల్ వద్దకు కూడా వెళ్ళేవాడు. ఇలా ఏడాది వరకు వెంట పడడంతో లాస్య లవ్ లో పడిపోయింది. అప్పుడు పలకరింపులు మొదలై ప్రపోజల్ వరకు వెళ్లింది. ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టమైనప్పటికీ.. ఇంటోవాళ్ళు ఒప్పుకోలేదు. తీరా వారిని ఒప్పించేసరికి ఏడేళ్లు పట్టిందని లాస్య, మంజునాథ్ జంట వెల్లడించింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.