ఈసారి సుకుమార్ ఛాన్స్ ఇవ్వలేదా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా ఉందంటూ మొదటి నుండి ప్రచారం జరుగుతోంది. ‘రంగస్థలం’ సినిమాతో అనసూయకి రంగమ్మత్త లాంటి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చిన సుకుమార్.. ‘పుష్ప’ సినిమాలో కూడా ఆమెని తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇందులో కూడా అనసూయ పాత్ర హాట్ గా ఉంటుందని అన్నారు.

తాజాగా ఈ వార్తలపై అనసూయ స్పందించింది. ‘పుష్ప’లో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు అయితే.. అలాంటి ప్రతిపాదన ఏమీ తన దగ్గరకు రాలేదని.. నిజంగా వస్తే తప్పకుండా చేస్తానని.. ఆ విషయాన్ని నేరుగా ప్రేక్షకులకు చెబుతానని వెల్లడించింది. ప్రస్తుతం తనకు మిగిలిన భాషల నుండి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని.. బాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా తనని సంప్రదిస్తున్నారని చెప్పింది. కానీ తన తొలి ప్రాధాన్యత మాత్రం బుల్లితెరకే అని..

మంచి అవకాశాలు వచ్చినప్పుడే సినిమాల్లో కనిపిస్తానని వెల్లడించింది. ప్రస్తుతం అనసూయ నటించిన ‘థాంక్యూ బ్రదర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే ‘చావు కబురు చల్లగా’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. వీటితో పాటు తమిళంలో ఓ సినిమా అలానే మలయాళంలో ఓ సినిమాలో నటిస్తోంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.