అర్జున్ రెడ్డి టైమ్ లో తిట్టిపోసింది, మరి ఇప్పుడు ఏమంటుందో

“అర్జున్ రెడ్డి” సినిమాలో “ఏం మాట్లాడుతున్నావ్ రా ****” అనే బూతు డైలాగ్ విషయంలో యాంకర్ అనసూయ టీవి9 సాక్షిగా సినిమా టీం & విజయ్ దేవరకొండ టీం మీద మండిపడిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్ గా కూడా ఆ విషయాన్ని గుర్తుచేసుకొంటు.. తనకు అప్పుడు ఎవరూ సపోర్ట్ చేయలేదని వాపోయింది అమ్మడు. అయితే.. ఇప్పుడు విజయ్ దేవరకొండ బ్యానర్ లో “మీకు మాత్రమే చెప్తా” అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. నవంబర్ 1వ తేదీన సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో.. త్వరలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మీడియా ఇంటర్వ్యూలు మొదలెట్టనుంది.

anasuya-and-vijay-deverakonda

మరి అప్పుడు విజయ్ మీద ఫైర్ అయిన అనసూయ.. ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ తన నిర్మాత కాబట్టి పొగడ్తల వర్షం కురిపిస్తుందా? అనేది చర్చనీయాంశం అయ్యింది. ఇకపోతే.. తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో “ఈ నగరానికి ఏమైంది?” ఫేమ్ అభినవ్ మరో ముఖ్యపాత్ర పోషించాడు. ట్రైలర్ ఆల్రెడీ జనాల్లో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. మరి సినిమా రిజల్ట్ ఏమవుతుంది అనేది తెలియాలంటే నవంబర్ 1 వరకూ వెయిట్ చేయాల్సిందే.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.