‘ఆచార్య’ తో అనసూయ ఐటెం సాంగ్… నిజమేనా..!

హాట్ యాంకర్ అనసూయ … బిజీ యాంకర్ కూడా..! అయినప్పటికీ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తుంటుంది. ‘ సోగ్గాడే చిన్ని నాయన’ ‘క్షణం’ ‘రంగస్థలం’ ‘ఎఫ్2’ ‘యాత్ర’ ‘కథనం’ ‘మీకు మాత్రమే చెబుతా’ వంటి చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెర పై ఈమె క్రేజ్ ను గుర్తించిన దర్శక నిర్మాతలు .. సినిమాల్లో కూడా వాడుకుని క్యాష్ చేసుకోవాలని భావిస్తూ ఆ దిశగా ఈమెకు ఛాన్స్ లు ఇస్తూ వస్తున్నారు.

ముఖ్యంగా మెగా హీరోలు ఈ బ్యూటీ క్రేజ్ ను వాడుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే.. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంలో ఈమెను ఎంపిక చేసారట. ఈ క్యారెక్టర్ నచ్చలేదు అని అనసూయ చెబితే మార్పులు చేసి మరీ ఈమెను ఒప్పించారు అని తెలుస్తుంది. ఇక తాజాగా మెగాస్టార్ – కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంలో అనసూయ ఓ ఐటెం సాంగ్ చేయబోతోందని వార్తలు వస్తున్నాయి.

Anasuya to shake leg with Chiranjeevi1

ఇందుకోసం ఆమెకు భారీ ఎత్తున పారితోషికం కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో సాయి తేజ్ హీరోగా వచ్చిన ‘ విన్నర్’ చిత్రంలో కూడా అనసూయ ఐటెం సాంగ్ చేసింది. ఇదిలా ఉంటే.. పవన్ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘విరూపాక్షి’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో కూడా అనసూయ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.