బాలీవుడ్ రీమేక్లో బోల్డ్ క్యారెక్టర్ చేయనున్న అనసూయ

ఒక సాధారణ యాంకర్ నుండి హాట్ యాంకర్ గా, అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిన అనసూయ జర్నీ చాలామందికి ఇన్స్పైరింగ్ అయితే కొందరికి మాత్రం షాకింగ్. నిన్నమొన్నటివరకూ ఫోటోషూట్ ల వరకు, డ్రెస్సింగ్ వరకు మాత్రమే బోల్డ్ గా వ్యవహరిస్తున్న అనసూయ.. త్వరలోనే మాంచి బోల్డ్ రోల్ ప్లే చేసేందుకు సన్నద్ధమవుతోంది. “భీష్మ”తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ నిన్న హిందీ సూపర్ హిట్ చిత్రం “అంధాధున్” తెలుగు రీమేక్ ను మొదలెట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అనసూయ ఒక బోల్డ్ రోల్ ప్లే చేయనుందని తెలుస్తోంది.

Anasuya Ropled For A Bold Role1

“అంధాధున్” చిత్రంలో టబు పోషించిన బోల్డ్ క్యారెక్టర్ ను అనసూయ రిప్రైజ్ చేయనుంది. ఒక సీనియర్ హీరోని పెళ్లి చేసుకొని.. మరో పోలీస్ ఆఫీసర్ తో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలో టబు అదరగొట్టింది. అశ్లీలతకు తావు లేకుండా చిత్రీకరించిన ఈ పాత్ర సినిమాకి హైలైట్. ఇప్పుడు అదే పాత్రలో అనసూయ కనిపించనుంది. మరి టబు స్థాయిలో అనసూయ ఈ పాత్రను రంజింపజేస్తుందా లేదా అనేది చూడాలి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.