బిగ్ బాస్ టీమ్ నుంచి ఇంట్రస్టింగ్ అప్ డేట్..!

బిగ్ బాస్ సీజన్ 4 చాలా ఆసక్తికరంగా సాగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్లందరికీ కూడా మంచి గుర్తింపు లభించిందనే చెప్పాలి. అభిజిత్, మోనాల్, అఖిల్, సోహైల్, అరియానా, అవినాష్, అమ్మరాజశేఖర్, దివి, హారిక, లాస్య, నోయల్ , గంగవ్వ ఇలా పార్టిసిపేట్ చేసిన అందరూ దాదాపుగా హైలెట్ అయినవాళ్లే. ముఖ్యంగా ఈసారి సోషల్ మీడియాలో ప్రోగ్రామ్ దుమ్మురేపిందనే చెప్పాలి. అందుకే ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సీజన్ ని అంటే ‘బిగ్ బాస్ సీజన్ 5’ ని తొందరగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అందుకే, స్టార్ మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో మీరు ఎంతమంది బిగ్ బాస్ ని మిస్ అవుతున్నారు అంటూ పోల్ ని సైతం నిర్వహిస్తున్నారు.

ఈసారి సీజన్ ని కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేస్తూ లీడ్ చేస్తారు. ఎందుకంటే, ఇప్పుడున్న హోస్ట్ లో అన్నింటిని బాగా బ్యాలన్స్ చేస్తుంది నాగార్జునే కాబట్టి ఈసారి సీజన్ కూడా నాగ్ సర్ డీల్ చేస్తారనే కన్ఫార్మ్ గా న్యూస్ తెలుస్తోంది. అంతేకాదు, నాగార్జున అయితే, సెలబ్రిటీ పార్టిసిపెంట్స్ కూడా వచ్చేందుకు ఈజీగా ఉంటుంది. అందుకే, ఇప్పట్నుంచే కొంతమంది సెలబ్రిటీ గెస్ట్ లని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది. అన్ని కరెక్ట్ గా ఉంటే, ఆగష్టు నెలలో చివరి ఆదివారం రోజున అంటే ఆగష్టు 29వ తేదిన బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ కాబోతోందని న్యూస్. బిగ్ బాస్ టీమ్ ఈ విషయాన్ని త్వరలోనే ఎనౌన్స్ చేయబోతోందట.

అంతేకాదు, ఈసారి నాగార్జునతో ఒక స్పెషల్ ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించేందుకు బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈసారి సీజన్ లో కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కొంతమంది సెలబ్రిటీలని సెలక్ట్ చేశారు. ఇందులో ఆరుగురు సోషల్ మీడియా ఫేమ్ అయినవాళ్లు ఉండబోతున్నారని టాక్. అంతేకాదు, ఈసారి బడ్జెట్ పరంగా కూడా సీజన్ 4 కంటే కూడా డబుల్ చేస్తారని ఊహించినదానికంటే ఎక్కువ రెమ్యూనిరేషన్స్ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీమ్ రెడీ అవుతోందని టాక్ వినిపిస్తోంది. మరి చూద్దాం.. ఈసారి సీజన్ 5 ఎలా ఉండబోతోంది అనేది. అదీ విషయం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.