నెట్టింట హల్ చల్ చేస్తున్న బాలయ్య,రజినీ ల రేర్ పిక్..!

ఇప్పుడు బాలయ్య,రజినీ కాంత్ ల రేర్ పిక్ ఒకటి నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. వీరితో పాటు సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా కూడా ఉండడం విశేషం. అసలు ఈ పిక్ ఎప్పుడు దిగారు.. ఏ సందర్భంలో దిగారు అని ప్రస్తుతం.. ఈ ఫోటోని చూస్తున్న నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గతంలో మీనా తెలుగు,తమిళ,మలయాళం భాషల్లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించేసింది. మరి టాలీవుడ్ స్టార్ హీరో అయిన రజినీకాంత్, తమిళ సూపర్ స్టార్ అయిన రజినీని ఎప్పుడు కలుసుకుంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

నిజానికి మీనా 1998 వ సంవత్సరం వరకూ స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే పైన మీరు చూస్తున్న ఫోటో ‘బొబ్బిలి సింహం’ సినిమా టైంలోనిది. ఆ చిత్రం ముహూర్తం షాట్ కు సూపర్ స్టార్ రజినీ కూడా హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజమండ్రిలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమయ్యింది. రజినీకాంత్ ఈ చిత్రం ఓపెనింగ్ కు హాజరయ్యి చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. రజినీ కాంత్ తో నందమూరి బాలకృష్ణకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.

ఇక ‘బొబ్బిలి సింహం’ చిత్రాన్ని కోందండ రామిరెడ్డి డైరెక్ట్ చేశారు. రాజమౌళి తండ్రి మరియు ‘బాహుబలి’ వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కూడా కథను అందించారు. 1994 సెప్టెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.