శర్వానంద్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ రూమర్‌

‘పెళ్లికాని ప్రసాద్‌’… ఈ పేరు గుర్తుందా? చాలా రోజుల క్రితం ఈ పేరుతోనే తెగ నవ్వించాడు వెంకటేశ్‌. ‘మల్లీశ్వరి’ సినిమాలో బ్యాంకు ఉద్యోగి పెళ్లికాని ప్రసాద్‌ గా వెంకీ వావ్‌ అనిపించాడు. ఇప్పుడు అదే ఫీట్‌ చేయడానికి శర్వానంద్‌ సిద్ధమయ్యాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో శర్వానంద్‌ పెళ్లికాని ప్రసాద్‌గా కనిపించబోతున్నాడట. పాత సెంటిమెంట్‌ ఓకే అయితే… ఈ సినిమా కూడా హిట్టే.

శర్వానంద్‌ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ చేస్తున్నాడు. దీంతోపాటు కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’చేస్తున్నాడు. ‘మహాసముద్రం’ చిత్రీకరణ చివరిదశకొచ్చింది. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ త్వరలో పట్టాలెక్కబోతుంది. అందులో శర్వా పాత్ర గురించి ఆసక్తికర విషయం బయటికొచ్చింది. అదే ఈ ‘పెళ్లికాని ప్రసాద్‌’. సినిమా టైటిల్‌ చూస్తే… ఇదేదో మహిళా ప్రధాన్య చిత్రం అనుకున్నారు. కానీ ఈ పుకారు వాటిని మార్చేసింది.

నిజానికి ‘ఆడవాళ్లూ మీకు జోహార్లూ’ సినిమాను వెంకటేశ్‌ చేయాల్సింది. ముందు అంతా ఓకే త్వరలో సినిమా స్టార్ట్‌ అని వార్తలొచ్చాయి. ఆ తర్వాత చూస్తే… శర్వ దగ్గరకు కథ వెళ్లింది. ఇప్పుడు షూటింగ్‌ మొదలు కాబోతోంది. ఒకవేళ వెంకీ ఒప్పుకొని ఉంటే ‘పెళ్లి కాని ప్రసాద్‌’ పాత్ర రెండోసారి వేసినట్లు అయ్యేది. శర్వ చేస్తున్నాడు కాబట్టి… కొత్తగానే ఉంటుంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Share.