ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ నుండీ ఇంట్రెస్టింగ్ అప్డేట్…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ప్రభాస్ … విక్రమాదిత్య గా, పూజా హెగ్డే ప్రేరణ గా కనిపించబోతున్నట్లు నిర్మాతలు వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ద్వారా వెల్లడించారు.

తాజాగా ఈ చిత్రం నుండీ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే …ఈ చిత్రంలో కథ ప్రకారం హీరోకి తమ్ముడి పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం కాస్త ఇమేజ్ ఉన్న నటుడు అయితేనే కరెక్ట్ అని చిత్ర బృందం భావించిందట. దాంతో ఈ పాత్రకు గద్దల కొండ గణేష్ ఫేం అధర్వ మురళిని అనుకున్నారట.కానీ అతను ఈ రోల్ చెయ్యడానికి ఇంట్రెస్ట చూపించ లేదని తెలుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.

నిజానికి అతను రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే అతని పాత్రలో తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ను ఎంపిక చేసుకున్నారట. మొన్నటివరకు రాదే శ్యామ్ షూటింగ్ ఇటలీలో జరిగింది. ఇక బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను వచ్చే వారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపనున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.