నరసింహనాయుడు మూవీ కథ ఎలా పుట్టిందో తెలుసా..?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల్లో నరసింహ నాయుడు సినిమా కూడా ఒకటి. నరసింహనాయుడు విడుదలై 20 సంవత్సరాలు గడిచినా ఈ సినిమా టీవీలో ప్రసారమైతే మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటోంది. బి గోపాల్ డైరెక్షన్ లో మేడికొండ మురళీకృష్ణ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం 2,001 సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. చిన్నికృష్ణ ఈ సినిమాకు కథ అందించగా పరుచూరి బ్రదర్స్ “కత్తులతో కాదురా..

కంటిచూపుతో చంపేస్తా” లాంటి పవర్ ఫుల్ డైలాగ్ లను రాశారు. ఈ సినిమా అప్పట్లోనే ఏకంగా 30 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం గమనార్హం. రచయిత చిన్నికృష్ణ బీహార్ రాష్ట్రంలో గ్రామంపై ఎవరైనా దాడి చేయడానికి వస్తే, వాళ్లకు ఎదుర్కోవడానికి ఇంటికి ఒక మగపిల్లాడిని చొప్పున బలిపశువుగా ఇవ్వగా ఆ రియల్ కథను రీల్ స్టోరీగా మార్పులు చేశారు. మూడు రోజుల్లో పరుచూరి బ్రదర్స్ తో కలిసి చిన్నికృష్ణ నరసింహ నాయుడు కథను సిద్ధం చేశారు.

ఈ సినిమాలో సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆశా షైనీ హీరోయిన్లుగా నటించారు. ఇతర భాషల్లో కూడా రీమేక్ అయిన ఈ సినిమా అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. కథ, కథనం, బాలకృష్ణ నటన, బి గోపాల్ దర్శకత్వ ప్రతిభ నరసింహ నాయుడు మూవీ ఇండస్ట్రీ హిట్ కావడానికి కారణమయ్యాయి. అయితే నరసింహ నాయుడు సినిమా తరువాత బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమా తెరకెక్కగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కథ, కథనంలో లోపాలు ఆ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.