మూడు రోజులుగా అమితాబ్ హాస్పిటల్ లోనే.. అసలేం జరిగింది..?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 80 ఏళ్లకు దగ్గరవుతున్నప్పటికీ ఇంకా కుర్ర హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు హిట్లు మీద హిట్లు కొడుతున్నారు. ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో గోసాయి వెంకన్న పాత్రలో తెలుగు ప్రేక్షకులని కూడా అలరించారు. అయితే గత కొంత కాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అది ఎక్కువవ్వడంతో హాస్పిటల్ పాలైనట్టు వార్తలు వస్తున్నాయి.

amitabh-bachchan-hospitalised1

తాజాగా కాలేయ సంబంధిత వ్యాధితో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారట బిగ్ బి. అక్టోబర్ 15న అర్ధరాత్రి 2గంటల సమయంలో కొంచెం అస్వస్థతకి గురవ్వడంతో ఆయన్ని వెంటనే ఆస్పత్రిలో చేర్చారట. ఈ మూడు రోజుల నుండీ ఆయన ముంబయిలోని నానావతి ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. అయితే ‘ఆయన రెగ్యులర్ గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తమే హాస్పిటల్ లో చేరారని.. కంగారు పడాల్సిన పని ఏమి లేదని… ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని’ హాస్పిటల్ సిబ్బంది తెలియజేసారు. దీంతో ‘బిగ్ బి’ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.