‘రంగ్ దే’ థర్డ్ సింగిల్ కు అద్భుతమైన రెస్పాన్స్..!

ఈ మధ్య కాలంలో ఏ పాట సూపర్ హిట్ అయినా.. అది కచ్చితంగా సిద్ శ్రీరామ్ పాడిన పాటే అవుతుంది అనడంలో సందేహం లేదు. ఈయన పాడిన పాటలు యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూస్ ను నమోదు చేస్తున్నాయి. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా హిట్ అనిపించుకుంది అంటే అతను పాడిన ‘నీలి నీలి ఆకాశం’ అనే పాట కంపెన్సేషన్ ఎంతో ఉందనేది వాస్తవం. అందుకే ప్రతీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇతనితో ఓ పాట పాడించాలి అని ఫిక్స్ అయిపోతున్నారు.

తమన్ ఇప్పటికే రెండు, మూడు పాటలు పాడించుకున్నాడు.గోపి సుందర్, అనూప్ రూబెన్స్ వంటి వారు కూడా సిద్ ను వాడేశారు. అయితే దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ఇప్పటి వరకూ సిద్ శ్రీరామ్ తో ఒక్క పాట కూడా పాడించలేదు. అయితే ఎట్టకేలకు ‘రంగ్ దే’ సినిమాలో ‘నా కనులు’ అనే పాటను పాడించాడు. కొద్దిసేపటి క్రితం మహేష్ బాబు.. ఈ పాటను విడుదల చేశారు. ఇలా విడుదలయ్యిందో లేదో ఈ పాట అప్పుడే వైరల్ అయిపోతుంది. ఈ పాట విన్నవాళ్ళంతా మళ్ళీ మళ్ళీ వింటున్నారు. శ్రీమణి అందించిన లిరిక్స్ కూడా బాగున్నాయి.

ఇప్పటికే ‘రంగ్ దే’ నుండీ విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇది ఆ రెండిటిని మించి రికార్డులు సృష్టిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. తొలిప్రేమ(2018) దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ పాటతో అవి డబుల్ అయినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ పాటను మీరు కూడా ఓసారి వినెయ్యండి :


తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.