అబ్బాయి ప్రేమలేఖ ఇస్తే నాన్నకు చూపించే ఓ అమ్మాయి కథ!

ప్రతి ప్రేమకథలోనూ ఓ అమ్మాయి, ఓ అబ్బాయి, తల్లిదండ్రులు కామన్ గా ఉంటారు. ఎక్కువగా సన్నివేశాలన్నీ వాళ్ళ మధ్య తిరుగుతాయి. కుప్పలు తెప్పలుగా వస్తున్న చిత్రాల మధ్య ఓ ప్రేమకథ ప్రత్యేకంగా నిలవాలంటే అందులో భావోద్వేగాలు బలంగా ఉండాలి. భావాన్ని వ్యక్తం చేసే మాటలు పదునుగా ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉండాలి. ‘అమరం అఖిలం ప్రేమ’ ట్రైలర్ చూస్తే… ఆ చిత్రంలో చక్కని ప్రేమ కథకు కావాల్సిన ఉద్వేగాలు అన్నీ ఉన్నట్లు అర్థమవుతోంది. ‘అమరం అఖిలం ప్రేమ’ కథ విషయానికి వస్తే… శకుంతలను కూతురిలా పెంచుకున్న కల్వ మహర్షి లాంటి ఓ తండ్రి. దుష్యంతుడు లాంటి ఓ అబ్బాయి. మిట్ట మధ్యాహ్నం వరకు మేడమీద నిద్రపోయే ఈతరం యువతకు ప్రతినిధి లాంటివాడు. అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు.

మొదట అమ్మాయి తనకు ఇష్టం లేదని వ్యతిరేకించినా తర్వాత ప్రేమలో పడుతుంది. అమ్మాయి తండ్రికి విషయం తెలిసిన తర్వాత అతను ఎలా రియాక్ట్ అయ్యాడు? అబ్బాయి తండ్రి ఏం చేశాడు? అనేది సినిమా కథ తెలుస్తోంది. రెండున్నర నిమిషాల ట్రైలర్ లో దర్శకుడు జోనాతన్ ఎడ్వర్డ్ కథను చూచాయిగా చెప్పేసిప్పటికీ… కథనంపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా చేశాడు. ముఖ్యంగా మాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. ‘నన్ను వదిలేసి వెళ్ళిపోతావా?’ అని హీరోయిన్ శివశక్తితో తండ్రి పాత్ర పోషించిన శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పే మాటలో… సినిమాలో కుమార్తెపై తండ్రి ప్రేమ అర్థం అవుతోంది. ‘తనను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండాలేను తెలుసా? గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెను ఎవరో రంపంతో కోసేసినట్టు ఉంటుంది తెలుసా?’ అని హీరో చెప్పే డైలాగులు ప్రేమలో అతను ఎంత సిన్సియర్ అనేది తెలుస్తుంది.

Amaram Akhilam Prema Movie Trailer Review1

అతని ప్రేమ గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ‘తన ఇంత ప్రేమించాడు అంటే… తిరిగి ప్రేమించకుండా ఉండలేనంత’ అని హీరోయిన్ చెప్పే డైలాగ్ హృదయానికి హత్తుకునేలా ఉంది‌. రధన్ నేపథ్య సంగీతం సన్నివేశాల్లో భావోద్వేగాన్ని మరింత ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఈనెల 18న ఆహా యాప్ లో సినిమాను విడుదల చేస్తున్నారు.


తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Share.