యాంగ్రీ స్టార్ రాజశేఖర్ సినిమా సైన్ చేసిన అమలపాల్

ఫెయిల్డ్ మ్యారేజ్ కారణంగా సినిమాల్లో వెనుకబడిపోయింది కానీ.. అమలాపాల్ ఒక అయిదేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్. తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య.. తమిళంలో ఆర్య, విజయ్ వంటి యంగ్ స్టార్ హీరోలందరితోనూ వర్క్ చేసింది. అయితే.. డివోర్స్ అనంతరం ఆమెతో స్టార్ హీరోలు నటించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ లేదా సీనియర్ ఆర్టిస్ట్స్ తో సినిమాలు చేస్తూ కెరీర్ ను నెట్టుకొచ్చింది.

amala-paul-to-romance-with-rajashekar1

అయితే.. తాజా సమాచారం ప్రకారం తెలుగులో చాన్నాళ్ల తర్వాత అమలాపాల్ ఒక సినిమా సైన్ చేసిందని తెలుస్తోంది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో అమలాపాల్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అమలాపాల్ క్యారెక్టర్ చాలా బాగుంటుందట. అందుకే అమలాపాల్ సినిమా సైన్ చేసిందని చెప్పుకొంటున్నారు. వచ్చే నెల నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది.

Share.