బాలయ్యకు హీరోయిన్ దొరికేసినట్టే..!

మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లు దొరకడం బాగా కష్టమైపోయింది. పాత హీరోయిన్లను పెడితే కుర్ర కారు అంత అట్రాక్ట్ అవ్వడం లేదు.. పైగా సినిమా పై బజ్ కూడా ఏర్పడడం లేదు. కొత్త హీరోయిన్లను పెడితే ఏజ్ గ్యాప్ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ క్రేజీ హీరోయిన్లనో లేక పొరుగు ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్లనో లేక స్టార్ డం ఉన్న హీరోయిన్లనో తెచ్చిపెడుతున్నారు దర్శకనిర్మాతలు.

చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలకు కూడా ఇదే సమస్య వచ్చి పడింది. ఇక బాలయ్య అయితే ఈ సమస్యని ఎప్పటి నుండో ఫేస్ చేస్తున్నాడు. చాలా వరకూ చేసిన హీరోయిన్స్ తోనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదని టాక్. ఈ చిత్రంలో బాలయ్య డబుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఒక పాత్రకు మాత్రమే హీరోయిన్ ఉంటుందా లేక రెండు పాత్రలకు హీరోయిన్లు ఉంటారా? అనేది ఇంకా క్లారిటీ లేదు.

గతంలో కేథరిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి. తరువాత హీరోయిన్ గురించి అసలు ఎటువంటి వార్తలు రాలేదు. అయితే ఇప్పుడు తమిళ హీరోయిన్ అమలా పాల్ ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. చెప్పాలంటే అమలా పాల్ మంచి సెలక్షనే. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ విషయం పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Share.