ఈ సంక్రాంతికి అల్లుడి సందడి కూడా ఎక్కువే..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. నభా నటేష్, అనూ ఇమాన్యుయల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘సుమంత్ మూవీ ప్రొడక్షన్’ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మించారు. సోనూసూద్ ,ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇక ప్రమోషన్లలో భాగంగా కొద్దిసేపటి క్రితం ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.

ఈ ట్రైలర్ చూస్తుంటే.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి కామెడీ యాంగిల్ ను ఎక్కువగా ట్రై చేసినట్టు స్పష్టమవుతుంది. అంతేకాదు 2011 లో సంతోష్ శ్రీనివాస్ – రామ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘కందిరీగ’ కు… ఈ ‘అల్లుడు అదుర్స్’ చిత్రం సీక్వెలా? అనే అనుమానాన్ని కూడా కలిగిస్తుంది.అయితే ట్రైలర్ చివర్లో హారర్ కామెడీ టచ్ ఇచ్చి.. దర్శకుడు ఆ ఫీల్ నుండీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసాడు. ఇక నభా నటేష్ గ్లామర్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, హీరో సాయి శ్రీనివాస్ ఎనర్జిటిక్ ఫైట్స్ మరియు డ్యాన్స్ లు కలగలిపి..

ఈ చిత్రాన్ని కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలబెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా ట్రైలర్ స్పష్టంచేసింది. ‘శీనుగాడు నా ఫ్రెండు.. యాక్షన్ సీక్వెన్సెస్ లో వీడిది సెపరేట్ ట్రెండు.. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ లేవమ్మా’ అనే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ అని చెప్పొచ్చు. మొత్తానికి ‘అల్లుడు అదుర్స్’ ట్రైలర్ ఓకే అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి :


2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Share.