ఓటిటిలో అల్లుడి సందడి మిస్ అవుతుందే..!

సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఓటిటి వేదికల పై కూడా సందడి చెయ్యడానికి ఒకదానికి ఒకటి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ రేసులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రం ముందుంది. ఈ చిత్రం జనవరి 29న(ఈరోజు) అమెజాన్ ప్రైమ్లో విడుదలయ్యింది. థియేటర్లలో మిస్ అయిన వారంతా ఈ చిత్రాన్ని ఓటిటిలో చూడడానికి ఎగబడుతున్నారు. ఇక సంక్రాంతి విన్నర్ గా నిలిచిన రవితేజ ‘క్రాక్’ కూడా ఫిబ్రవరి 5న ‘ఆహా’ లో విడుదల కాబోతుంది.

నిజానికి జనవరి ఎండింగ్లోనే క్రాక్ విడుదల కావాల్సి ఉండగా.. డిస్ట్రిబ్యూటర్ల విన్నపం మేరకు ‘ఆహా’ అధినేత అల్లు అరవింద్ గారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక మరో హిట్ మూవీ ‘రెడ్’ కూడా అతి త్వరలో ఓటిటిలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రం మాత్రం ఓటిటి రిలీజ్ లేదని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను..

సినిమా ప్రారంభమైనప్పుడే జెమినీ వారికి అమ్మేసారట నిర్మాతలు. దీంతో ఇక ఓటిటి రిలీజ్ ఉండదని.. డైరెక్ట్ గా ఛానల్ వారు ప్రీమియర్ ను టెలికాస్ట్ చేసినప్పుడే చూడాలని స్పష్టమవుతుంది. ఏమైనా థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయ్యి.. ఓటిటిలో చూద్దామని భావించిన ప్రేక్షకులకు ఇది నిరాశపరిచే వార్తనే చెప్పాలి.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Share.