‘అల్లుడు అదుర్స్’ సినిమా నిర్మాతకు మిగిలింది ఏంటి?

థియేటర్లు తెరుచుకుని జనాలు ఎగబడి వస్తున్నారు అని తెలిసిన వెంటనే ఈ సంక్రాంతికి 4 సినిమాలు ముస్తాభయ్యి వచ్చాయి. వీటిలో ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘మాస్టర్’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రామ్ ‘రెడ్’ సినిమా కూడా హిట్ అనిపించుకుంది. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రం సంగతి ఏంటి? ఆ సినిమా ఫైనల్ రిపోర్ట్ ఏంటి? అని చాలా ప్రశ్నలు వచ్చాయి. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘అల్లుడు అదుర్స్’ చిత్రానికి 32కోట్ల వరకూ బడ్జెట్ పెట్టారట.

ఈ చిత్రం షూటింగ్ మొదలైన టైంలోనే జెమినీ టీవీ వారికి శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ను 8 కోట్లకు అమ్మేసారట. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ ను ఏకంగా 14కోట్లకు అమ్మారట. ఇక ఆడియో రైట్స్ ను ఆదిత్య వారికి 1 కోటికి అమ్మినట్టు తెలుస్తుంది. దీంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రం 23కోట్ల రికవరీ సాధించింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే ప్లాప్ టాక్ వచ్చింది.ఈ చిత్రాన్ని పూర్తి స్థాయిలో ఓన్ రిలీజ్ చేసుకున్నారని టాక్.

అయినప్పటికీ సాయి శ్రీనివాస్ సినిమాలకు మాస్ లో ఉన్న క్రేజ్.. అలాగే సంక్రాంతి పండుగ కలిసి రావడంతో మొదటి వారమే 9 కోట్ల పైనే వసూళ్లను రాబట్టిందని ఇన్సైడ్ టాక్.దాంతో నిర్మాత అలా సేఫ్ అయిపోయాడని వినికిడి. ఇదిలా ఉండగా… ఇంకా సి సెంటర్స్ లో ఈ చిత్రం ఆడుతూనే ఉంది. దాంతో ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Share.