అల్లు శిరీష్ స్టైలిష్ అవతారం.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఒక్క తెలుగులోనే కాకుండా బన్నీకి ఇతర భాషల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలకు కూడా ఆయన స్టయిలింగ్ అంటే చాలా ఇష్టం. కొన్ని సార్లు బన్నీ స్టయిల్స్ ని కాపీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాషన్, స్టయిలింగ్ విషయంలో బన్నీని ఫాలో అవుతున్నాడు అల్లు శిరీష్. గతంలో ఓ మ్యాగజైన్ కవర్ షూట్ లో పాల్గొని స్టయిలింగ్ లో తన అన్నకి తక్కువేమీ కాదని నిరూపించుకున్నాడు. తాజాగా మరోసారి తన కాస్ట్యూమ్స్, స్టైల్ తో వార్తల్లో నిలిచాడు అల్లువారి చిన్నబ్బాయి.

రీసెంట్ గా మెగాడాటర్ నీహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే.ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో ఈ వేడుకను జరిపించారు. ఈ పెళ్లి వేడుకలు మెగా హీరోలు, అల్లు హీరోలు సందడి చేశారు. ప్రతీ ఒక్కరూ ఎంతో ట్రెడిషనల్ గా కనిపించారు. అల్లు శిరీష్ కూడా తన డిజైనర్ దుస్తులతో ఆకట్టుకున్నాడు. మొదట వెన్యూ వద్ద బ్లాక్ జర్కిన్ లో ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ఆ తరువాత బ్లాక్ కుర్తా పైజామా.. వైట్ కోట్ ధరించి తన లుక్ తో సర్ప్రైజ్ చేశారు.

ఈ డ్రెస్ లో అల్లు శిరీష్ రాకుమారుడిలా కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ వినిపించాయి. మరో సందర్భంలో పీచ్ కలర్ కుర్తా, వైట్ కలర్ ప్యాంట్ ధరించి సింపుల్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. ఇక పెళ్లి సమయంలో అల్లు శిరీష్ ధరించిన షేర్వాణీ హైలైట్ గా నిలిచింది. నీహారిక పెళ్లి వేడుకలో అల్లు శిరీష్ డిజైనర్ వస్త్రాలు, అతడి స్టైలిష్ లుక్ చాలా మందిని కట్టిపడేసింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.