అల్లు శిరీష్ ఏం చేస్తున్నడంటే..?

టాలీవుడ్ లో చాలా కాలంగా మొదటి హిట్టు కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. ఎన్ని సినిమాలు చేసినా కొత్తగానే ట్రై చేసినట్లు పాజిటివ్ కామెంట్స్ అందుకుంటున్నాడు కాని సరైన బాక్సాఫీస్ హిట్టు మాత్రం కొట్టడం లేదు. నిర్మాత అల్లు అరవింద్ కెరీర్ మొదట్లో బన్నీపై పెట్టిన ఫోకస్ కంటే ఎక్కువగా శిరీష్ పైనే ఫోకస్ పెట్టారు. ఎంతో అనుభవం ఉన్న అల్లు అరవింద్ మీడియం దర్శకులతో మంచి మంచి కథలను సెట్ చేయించినప్పటికి వర్కౌట్ అవ్వడం లేదు.

ఇక అల్లు శిరీష్ కూడా సొంత ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ను పెంచుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. చివరగా 2019లో ABCD అనే మళయాళం రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ ఈ సారి సరికొత్తగా కిక్కివ్వాలని ఎదో ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో స్టైలిష్ ఫొటోలను వదిలిన అల్లు శిరీష్ త్వరలోనే డిఫరెంట్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చెప్పకనే చెబుతున్నాడని అనిపిస్తోంది.

ప్రస్తుతం రాకేష్ శశి అనే దర్శకుడితో ఒక సినిమాను రెడీ చేస్తున్నాడు. ఇంతకుముందు ఈ దర్శకుడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ తో విజేత అనే సినిమా చేశాడు. అల్లు శిరీష్ రాబోయే సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. మరి ఈసారైనా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవుతాడో లేదో చూడాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.