అల్లు అరవింద్ మనవరాలు అన్విత బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్..!

అల్లు వారి ఫ్యామిలీలో ఏ చిన్న వేడుక జరిగినా.. ఫ్యామిలీ అంతా అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ లో.. అంటే ఉదాహరణకి ఒకరు విదేశాల్లో ఉన్నప్పటికీ.. ఆ వేడుకకి ప్లాన్ చేసుకుని మరీ హాజరయ్యి.. ఫ్యామిలీతో సందడి చేస్తుంటారు. తాజాగా అల్లు అరవింద్ మనవరాలు..అల్లు అన్విత పుట్టినరోజు వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. ఈమె అల్లు బాబీ(వెంకట్) కూతురు. అంటే అరవింద్ గారికి పెద్ద మనవరాలు అనమాట.

ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి. అయితే ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ మిస్ అవ్వడం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఆయన అభిమానులు కూడా ఒకింత నిరాశకు గురయ్యారు. నిజానికి అల్లు అర్జున్.. ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. అడవుల నేపథ్యంలో సాగే సినిమా.. అందులోనూ ఆగష్ట్ 13న విడుదల చేయబోతున్నట్టు కూడా ఆల్రెడీ ప్రకటించేసారు కాబట్టి.. ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.

అందుకే బన్నీ.. అన్విత పుట్టినరోజు వేడుకకు హాజరుకాలేదట. అయినప్పటికీ ఈమెకు ఓ గిఫ్ట్ పంపి సర్ప్రైజ్ చేసాడట. అంతేకాకుండా వీడియో కాల్ మాట్లాడాడని కూడా తెలుస్తుంది. ఇక అన్విత తల్లిదండ్రులు అయిన అల్లు బాబీ, నీలిమ బండిలు 2016లో విడిపోయారు. అటు తరువాత నీలా షా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు బాబీ. అయినప్పటికీ మొదటి భార్య పిల్లలకు సంబంధించి ప్రతీ వేడుకను అల్లు ఫ్యామిలీ దగ్గరుండి ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.

1

2

3

4

5

6

7

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.