అన్ని భాషలన్నీ టార్గెట్ చేసిన బన్నీ..!

డైరెక్టర్ సుకుమార్ తో బన్నీ చేస్తున్న పుష్ప సినిమా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఇట్టే వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు, ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ని చేస్తూ అఫీషియల్ లోగోలని వాటిపై పెడుతూ డైరెక్టర్ సుకుమార్ కే షేర్ చేస్తున్నారు. దీనివల్ల ఒరిజినల్ పోస్టర్ ఏది.. ఫ్యాన్స్ మేడ్ పోస్టర్ ఏదో కూడా అర్ధం కాని పరిస్థితి. ఇది ఇలా ఉంటే ఈసినిమాని పిన్ టు పిన్ డిటైల్ గా తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ కి సవాల్ గా మారిందట. అడవిలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

దీన్ని నేషనల్ సబ్జెక్ట్ గా మారుస్తూ ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించబోతున్నారు. అంతేకాదు, అప్పట్లో పోలీస్ ఎన్ కౌంటర్స్ ఎలా ఉండేవి, ఎలా కేసులని బయటకి రాకుండా మాయం చేసేవాళ్లు అనేకోణంలో కూడా సినిమా ఉండబోతోందట. ఎలాంటి కాంట్రవర్సీలు రాకుండా ఈ సినిమాని చేయాలని చూస్తోంది చిత్రయూనిట్. మరోవైపు మేకర్స్ ఈసినిమాని ఏకంగా పదిభాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో భాషాభేదం లేకుండా బన్నీకి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చింది. సాంగ్స్ కి వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

అందుకే, ఇప్పుడు ఈసినిమాని ప్రతి భాషలో రిలీజ్ చేస్తే మినిమమ్ మార్కెట్ కొట్టొచ్చని చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈసినిమాతో బన్నీ పాగా వేయబోతున్నాడు. అక్కడ తన మార్కెట్ స్టామినాని పరీక్షించుకోబోతున్నాడు. బన్నీ డ్యాన్స్ కి బాలీవుడ్ లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఈసినిమా ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా బాలీవుడ్ బాక్సీఫీస్ ని షేక్ చేస్తుంది. అందుకే బీ టౌన్ లో బన్నీ హవా ఎలా ఉండబోతోందనేది ఫ్యాన్స్ లో ఆసక్తినిరేకెత్తిస్తోంది. అదీ విషయం.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.