సింగిల్ గానే ఎంజాయ్ చేస్తాను.. ఇలాగే బాగుంది!

కరోనా వైరస్ వల్ల ఏర్పడిన లాక్ డౌన్ వల్ల షూటింగ్లు క్యాన్సిల్ అవ్వడంతో.. హీరోలందరికీ ఫ్రీ టైం దొరికింది. ఈ టైముని వృధా చేసుకోవడం ఎందుకని భావించి… పెళ్లి వయసుకు వచ్చిన హీరోలందరూ.. ఆ వైపుగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా వంటి హీరోలు.. పెళ్లి చేసుకుని ఓ ఇంటివారయ్యారు. మెగా మేనల్లుడు సాయి తేజ్, వరుణ్ తేజ్ వంటి హీరోలు కూడా పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీ అవుతున్నారని వినికిడి.

ఈ క్రమంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన హీరోలందరికీ.. ‘మీ పెళ్లి ఎప్పుడు?’ అనే ప్రశ్న ఎదురవుతుంది. ఈ లిస్ట్ లో నవదీప్ కూడా ఉన్నాడు. హీరోగా పలు సినిమాల్లో నటించిన నవదీప్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ‘బిగ్ బాస్’ మొదటి సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి.. తన గేమ్ తో అందరినీ ఆకట్టుకున్న నవదీప్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు నవదీప్ కు పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎక్కువయ్యింది. ఆ విషయం పై నవదీప్ స్పందిస్తూ.. “నాకు అందరిలా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. సింగిల్‌గానే లైఫ్ ను ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నాను” అంటూ జవాబిచ్చాడు. నవదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారికి తీశాయనే చెప్పాలి.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.