చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు..?

హీరో కార్తికేయ మాస్ లుక్ లో డాక్టర్ గా లావణ్య త్రిపాఠి క్లాస్ లుక్ లో వస్తున్న సినిమా చావుకబురు చల్లగా. ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచీ కూడా ఈసినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత సరైన హిట్ కొసం ఎదురుచూస్తున్న హీరో కార్తికేయకి బ్రేక్ ఇచ్చేలాగానే కనిపిస్తోంది ఈసినిమా. యాక్షన్ రొమాంటిక్ సినిమాగా దీన్ని కౌషిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాలో హాట్ యాంకర్ అనసూయ ఐటమ్ సాంగ్ కూడా చేస్తుండటం అనేది సినిమాపై అంచనాలని మరింత పెంచేస్తోంది.

ఈ నేపథ్యంలో సినిమాని మార్చి 19న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. అందుకోసం మార్చి 9వ తేదిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇప్పుడు బన్నీ రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న బన్నీ ఆ లుక్ లో ఎక్కడా కూడా కనిపించడం లేదు. అయితే, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే గనక ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరి ఇది అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ తాకిడి తట్టుకోవడం కష్టమే. ఈ సినిమాలో కార్తికేయ సర్వపురి వెహికిల్ డ్రైవర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ యూట్యూబ్లో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమాతో కార్తికేయ ఎలాంటి హిట్ కొడతాడు అనేది ఆసక్తికరం.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.