త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ ఫలించినట్టే…!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సక్సెస్ అయ్యారు. అదేంటి ఇంకా ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదలవ్వకుండానే సక్సెస్ ఎలా…? అని కంగారు పడకండి. విషయం ఏమిటంటే… ‘అల వైకుంఠపురములో’ సినిమా ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ కి యూట్యూబ్ లో ఏకంగా..ఏడు లక్షల లైక్ లు.. 41 మిలియన్ వ్యూస్ ను సాధించి రికార్డు సృష్టించింది.

samajavaragamana-becomes-the-most-liked-telugu-song1

దీంతో సినిమాకి ప్రమోషన్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. ఎక్కడ చూసినా ఇదే పాట… ఎక్కువ మంది ఫోన్ లకి ఈ పాటే కాలర్ ట్యూన్, హలో ట్యూన్. ఇలా సినిమాకి కావల్సినంత ప్రచారం దక్కుతుంది. విడుదలకి ఇంకా 2 నెలలు టైం ఉన్నా .. ఈ ఒక్క పాటతో సంక్రాంతి విన్నర్ బన్నీ నే అనేలా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.