సూపర్ మార్కెట్ లో సరుకులు కొంటున్న బన్నీ…!

ఇండియా వైడ్ లాక్ డౌన్ కాబట్టి… చాలా మందికి అది ఇబ్బందిగా మారింది. చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. చెప్పాలంటే ఎక్కువగా ఎవ్వరూ ఇల్లు వదిలి బయటకి రావడం లేదు. పెద్దవాళ్ల ఇంట్లో పని చేసేవారికి కూడా… కొన్ని రోజులు ఇంట్లోనే ఉండమని వారికి సెలవులు ఇచ్చారు. ఈ లిస్టు లో సినీ ప్రముఖులు అనేకం. ఈ విషయంలో ముందుగా అల్లు అర్జున్ నే ఉదాహరణగా చెప్పుకోవాలి. అవును ఇప్పుడు బన్నీ తన ఇంట్లో పని చేసే వారికి సెలవులు ఇచ్చేసాడట.

తమ జీతం ఏమాత్రం తగ్గించను అని.. ఎవ్వరూ ఇళ్ళు దాటి బయటకి రావొద్దని వారిని కోరాడట. కొద్ది రోజుల పాటు తమ ఇంట్లో పనులు… తనే చూసుకుంటాను అని చెప్పాడట. అసలే ఇద్దరి పిల్లల తండ్రి.. కాబట్టి ఇంట్లో చాలా సరుకులు అవసరం పడుతుంది. అందుకోసం తాజాగా ఆయన్ జూబ్లి హిల్స్ రోడ్ నెంబర్ 30 వద్ద ఉన్న రత్న దీప్ కు వెళ్ళి… కొద్ది రోజులకు సరిపడా సరుకులను తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది.ఇలా బన్నీ షాపింగ్ చేస్తూ… ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ ఫోటోలో బన్నీ పసుపు పచ్చ టీ షర్ట్ లో …స్పోర్ట్స్ షూ వేసుకుని అలాగే మొహానికి మాస్క్ ధరించి ఉన్నాడు. బన్నీ సింప్లిసిటీ చూసి ఎంతో మంది ఆయన్ని అభినందిస్తున్నారు. మరికొందరు అయితే ‘పాపం బన్నీకి ఇంత కష్టం వచ్చిందేమిటి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.