అల్లు అర్జున్ బయట తిరగడానికి కారణం అదేనా?

అప్పట్లో సినిమా వాళ్ళు బయట కనబడితే.. అదో పెద్ద విడ్డూరం అన్నట్టు గుంపులు గుంపులుగా కూడుకునే వాళ్ళు. చిన్న చిన్న హీరోలు, ఆర్టిస్ట్ లు బయటకి వచ్చినా అలాగే..గుంపులుగా కూడేవారు . కానీ ఇప్పటి రోజుల్లో జనాలు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వారి పనుల్లో వారు బిజీగా ఉండడం.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేరుగా సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అవ్వడం.. వాటి వల్లనే కావచ్చు. కానీ ఓ స్టార్ హీరో బయటకి వస్తే మాత్రం ఇప్పటికీ జనాలు గుంపులుగా కూడుతూనే ఉంటున్నారు.

సెల్ఫీలు, ఫోటోలు అంటూ హీరో పైకి దూసుకువస్తుంటారు.అందుకే హీరోలు కూడా బయటకి ఎక్కువగా రారు. కానీ మన బన్నీ మాత్రం చాలా ఫ్రీగా బయటకి వచ్చేసాడు. పొడువాటి జుట్టు, పెరిగిన గడ్డంతో ఉన్న బన్నీ… వైట్ టి షర్ట్, వైట్ షార్ట్ ధరించి బయటకు వచ్చాడు. అలా బన్నీ రోడ్డు పై నడుస్తూ ఉండగా.. ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసారు. అది కాస్త వైరల్ అయిపోయింది.

Allu Arjun Soptted Walking On Roads Side1

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రం కోసమే ఇలా బన్నీ గడ్డం పెంచుతున్నాడు అని క్లియర్ గా స్పష్టమవుతుంది. ఇప్పుడు లాక్ డౌన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి రోడ్డు పై జనాలు ఎవ్వరూ ఉండరు అనే ఉద్దేశంతో.. ఊరికే అలా.. బన్నీ వాకింగ్ కు వచ్చి ఉంటాడు. ఇక ఈ ఫోటోకి చిన్న విమర్శ కూడా లేకపోతే బాగోదు అనుకున్నారో.. ఏమో కొందరు నెటిజన్లు.. ‘మాస్క్ లేకుండా బయటకి తిరగడం ఏంటి’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

Most Recommended Video

 

View this post on Instagram

 

#AlluArjun

A post shared by Filmy Focus (@filmyfocus) on


మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Share.