స్టైలిష్ స్టార్ లానే స్టైలిష్ గా ఉంది!

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తన కెరీర్ ఆరంభం నుండీ స్టార్ హీరోలకి బిన్నంగా ఉండే కథల్ని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు బన్నీ.ఇప్పుడు తన కార్ వ్యాన్ విషయంలో కూడా అదే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తను వాడే ప్రాపర్టీస్ అన్నీ కూడా స్టైలిష్ గా ఉండేలా చూసుకునే మన స్టైలిష్ స్టార్… కార్ వ్యాన్ ను అలాగే డిజైన్ చేయించుకున్నాడట.

allu-arjun-convoy-cost1

ముంబైలోని ఓ ఇంటీరియర్ వ్యానిటీ వ్యాన్ డిజైనింగ్ స్పెషలిస్టు తో ఈ వ్యాన్ ను డిజైన్ చేయించారని సమాచారం. ఇందుకోసం ఏకంగా 3.5 కోట్లు అదనంగా ఖర్చయిందని తెలుస్తుంది. కారవ్యాన్ కొనేందుకు 3.5కోట్లు… అలాగే దానిని ప్రత్యేకంగా డిజైన్ చేసినందుకు 3.5 కోట్లు.. మొత్తంగా 7 కోట్లు ఖర్చయ్యిందట. ఈ కార్ వ్యాన్ ను డిజైన్ చేయడానికే మూడు నెలల సమయం పట్టిందట. ఇప్పటివరకూ భారతదేశంలో ఎవరూ డిజైన్ చేయించని సరికొత్త బ్రాండ్ న్యూ ఫీచర్లతో ఈ కారవ్యాన్ ని అల్లు అర్జున్ కోసం డిజైన్ చేశారని తెలుస్తోంది. బ్లాక్ కలర్ లో చాలా స్టయిలిష్ గా ఉన్న ఈ కార్ వ్యాన్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

Share.