రౌడీకి ఇచ్చిన మాట ప్రకారం ప్రమోషన్స్ కు రౌడీ వేర్ వేసుకున్నాడు

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ అంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ముందు నుండీ ప్రత్యేకమైన అభిమానం. అతడి సినిమా “గీత గోవిందం” సూపర్ హిట్ అయితే స్పెషల్ పార్టీ ఇవ్వడమే కాక.. “ట్యాక్సీవాలా” ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా కూడా వచ్చాడు. ఆ ఈవెంట్ కి ఎప్పట్లానే చాలా డిఫరెంట్ గా వచ్చిన విజయ్ దేవరకొండను చూసి బన్నీ “నాకు నీ స్టైల్ నచ్చింది” అన్నప్పుడు “అన్న నీకు కూడా కొన్ని పంపిస్తాను” అన్నాడు విజయ్. దాదాపు ఏడాది క్రితం అన్న మాటను గుర్తుపెట్టుకొని మొన్న “అల వైకుంఠపురములో” రిలీజ్ సందర్భంగా రౌడీ వేర్ టీషర్ట్స్ పంపించాడు విజయ్. ఆ టీషర్ట్స్ ను ట్విట్టర్లో షేర్ చేస్తూ థ్యాంక్స్ చెప్పిన బన్నీ.. సినిమా ప్రమోషన్స్ లో ఈ టీషర్ట్ వాడతాను అని చెప్పాడు.

vijay devarakonda using allu arjun1

అన్నమాట ప్రకారం.. “అల వైకుంఠపురములో” ప్రమోషన్స్ లో రౌడీ వేర్ టీషర్ట్స్ ను వేసుకొంటున్నాడు బన్నీ. దాంతో రౌడీ గ్యాంగ్ మొత్తం ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇలా జూనియర్ హీరోలు, సీనియర్ హీరోల నడుమ మంచి సఖ్యత ఉండడం అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం. ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.