బాలీవుడ్ లో బన్నీ టైమ్ స్టార్ట్ అయ్యిందా..?

సుకుమార్ తో బన్నీ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఇప్పుడు ఈ సినిమాకి బాలీవుడ్ లో భారీగా మార్కెట్ ఏర్పడుతోందని టాక్. ఎందుకంటే, రీసంట్ గా అలవైకుంఠపురములో సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బన్నీ సాంగ్స్ తో బాలీవుడ్ ప్రేక్షకులని ఆకర్షించాడు. అంతేకాదు, ఈసాంగ్స్ టిక్ టాక్ వీడియోలు చేస్తూ బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం రెచ్చిపోయారు. అందుకే, ఇప్పుడు రాబోతున్న బన్నీ పుష్ప సినిమాకి బాలీవుడ్ లో భారీ రేటు పలుకుతోందట.

సుకుమార్ ముందుగానే ఈ సినిమాని ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించేశాడు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు ప్రి రిలీజ్ బిజినెస్ కోసం కొన్ని మీడియా సంస్థలు పోటీ పడుతున్నట్లుగా టాక్. అంతేకాదు, ఓవర్సీస్ లో కూడా పుష్ప సినిమాని కొనేందుకు కొన్ని కంపెనీలు ఎగబడుతున్నాయి. దీన్ని పూర్తిగా క్యాష్ చేసుకునేందుకు చూస్తోందట పుష్ప మూవీ టీమ్. అందుకే బాలీవుడ్ లో బన్నీ సినిమాని భారీ రేటుకి అమ్మాలని చూస్తున్నారు.

అంతేకాదు, అక్కడ ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా వచ్చే ప్లాన్స్ చేస్తున్నారట. ఇక బన్నీ సినిమాకి బాలీవుడ్ లో బాక్సులు బద్దలే అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.