స్టూడియో కట్టాలనే అప్పుడే అనుకున్నారట!

టాలీవుడ్ లో పేరున్న కుటుంబాలకు సొంత స్టూడియోలు ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టుడియోస్, దగ్గుబాటి ఫ్యామిలీకి రామానాయుడు స్టూడియోస్, నందమూరి ఫ్యామిలీకి రామకృష్ణ స్టూడియోస్ ఉన్నాయి. కానీ మెగా ఫ్యామిలీకి మాత్రం స్టూడియో లేదు. ఇప్పుడు అల్లు అరవింద్ ఆ లోటుని తీర్చడానికి సిద్ధమవుతున్నారు. అల్లు స్టూడియోస్ పేరుతో నిర్మాణానికి ఇటీవలే పునాది వేశారు. అయితే ఈ ఆలోచన అల్లు అరవింద్ చేయలేదట. ఆయన కుమారుడు అల్లు అర్జున్ స్టూడియో నిర్మిద్దామని తండ్రికి చెప్పి..

ఆయనతో పాటు కుటుంబంలో అందరినీ ఒప్పించాడట. ఈ ఆలోచన తనకు రావడానికి కారణం ఏంటో సామ్ జామ్ షోలో చెప్పుకొచ్చాడు. ఈ షోలో బన్నీ.. సమంతతో మాట్లాడుతూ.. మీకు కూడా ఓ స్టూడియో ఉంది కదా.. అలాగే పెద్ద ఫ్యామిలీస్ అన్నింటికీ స్టూడియోలు ఉన్నాయి. మనకు కూడా ఓ స్టూడియో ఉంటే బాగుంటుందని ఎప్పటినుండో అనుకుంటే ఉండేవాడినని బన్నీ చెప్పాడు. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడున్న వ్యక్తి వెల్కమ్ టు అన్నపూర్ణ స్టూడియో సార్ అన్నాడట.

ఆ పిలుపు విన్నప్పుడు బన్నీకి కూడా సొంతంగా ఓ స్టూడియో ఉంటే బాగుంటుందని అనిపించిందట. అందుకే వెంటనే తన తండ్రితో మాట్లాడి స్టూడియో నిర్మిద్దామని చెప్పారట. కుటుంబంలో అందరూ ఒప్పుకోవడంతో స్టూడియో నిర్మాణం మొదలైందని చెప్పుకొచ్చాడు. తను ఉన్నంతవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానని.. అంతకాలం స్టూడియో ఉపయోగపడుతుందని చెప్పాడు. అలానే ఇండస్ట్రీకి కూడా ఒక ప్రపంచ స్థాయి స్టూడియో అందించాలనే ఉద్దేశంతో ఈ స్టూడియో నిర్మాణం మొదలుపెట్టినట్లు బన్నీ తెలిపాడు.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Share.