ఆ విషయంలో కూడా రష్మిక తో బన్నీ ఇదే మొదటిసారి..!

అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే సుకుమార్ డైరెక్షన్లో చేయడానికి బన్నీ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో బన్నీ ఓ స్మగ్లర్ గా కనిపించబోతున్నాడట. ఊర మాస్ లుక్ లో బన్నీ లుక్ ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం తిరుపతి సమీపంలోని కొన్ని లొకేషన్లను ఫైనల్ చేసే పనిలో దర్శకుడు ఉన్నాడట. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

rashmika-mandanna-allu-arjun-sukumar

వీరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయని తెలుస్తుంది. ఈ చిత్రంలో రష్మిక తో పెళ్ళైన తరువాత బన్నీ రొమాంటిక్ ట్రాక్ మొదలవుతుందని తెలుస్తుంది. ఫుల్ లెంగ్త్ భర్త పాత్ర అన్న మాట. బన్నీ 16 ఏళ్ళ సినీ కెరీర్లో భర్త పాత్రలో కనిపించబోతున్న సినిమా ఇదే. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. నాని ‘గ్యాంగ్ లీడర్‌’కు కెమెరామెన్‌గా పనిచేసిన మిరోస్లావ్ కూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండడం విశేషం.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.