అల్లు అరవింద్ కోసం చిరంజీవి భారీ సిరీస్..!

ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతుండగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ దూసుకుపోతున్నాయి. అద్భుతమైన కంటెంట్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తూ మార్కెట్ కొల్లగొడుతున్నాయి. ఇక లాక్ డౌన్ సమయం నుండి వీటికి మరింత ఆదరణ వచ్చి చేరింది. సినిమా థియేటర్స్ బంధ్ నేపథ్యంలో సినీ అభిమానులు ఓ టి టి ప్లాట్ ఫార్స్ కి బాగా అలవాటు పడుతున్నారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్ని ప్లస్ హాట్ స్టార్ వంటి దిగ్గజ కంపెనీలు భారత్ లో పాతుకుపోయాయి. ఇక అనేక మంది బడా నిర్మాతలు ఇటు వైపు చూస్తున్నారు.

టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ ముందు చూపుతో ఆహా అనే ఓ ఓటిటి యాప్ ని ప్రారంభించడం జరిగింది. గత ఆరు నెలలుగా దానిని అభివృద్ధి చేయడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన స్టార్ రైటర్స్ మరియు డైరెక్టర్స్ ని దీనికోసం దించారు. ఐతే ఆయన ఆహా కు మంచి ప్రచారం తేవడం కోసం ఏకంగా చిరంజీవిని దించే ప్రయత్నాలలో ఉన్నారని తెలుస్తుంది. చిరంజీవితో ఆయన ఓ భారీ సిరీస్ తెరకెక్కిస్తారట. దీని కోసం ఆయన కథను కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారట.

వీలైనంత తొందరగా చిరుతో సీరిస్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అనేక మంది టాప్ స్టార్స్ సైతం ఓటిటి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి అమితంగా ప్రేమించే అమితాబ్ గులాబో సితాబో చిత్రం ఓటిటి లో విడుదలైంది. కాబట్టి మంచి సబ్జెక్టు దొరికితే చిరంజీవి సిరీస్ చేస్తారు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో నటిస్తున్నారు. అలాగే రెండు రీమేక్ చిత్రాలలో కూడా నటించే ఆలోచన చేస్తున్నారు.

Most Recommended Video

నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Share.