అది గుళ్లో పులిహోర కాదు.. ప్యారడైజ్ బిర్యాని విత్ ఎక్స్ ట్రా లెగ్ పీస్..!

అల్లరి నరేష్ యాక్ట్ చేస్తున్న బంగారు బుల్లోడు సినిమా పేరు తగ్గట్లుగానే బంగారం చుట్టూనే తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. రీసంట్ గా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ సినీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. బ్యాంక్ లో బంగారాన్ని ఎక్కువ వడ్డీకి ఇస్తూ అల్లరి నరేష్ అండ్ కామెడీ గ్యాంగ్ చేస్తున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ కొట్టేలాగానే కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లరి నరేష్ బ్యాంక్ ఎంప్లాయిగా పనిచేస్తూ బ్యాంక్ లో తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంత అవసరాలకి వాడుకుంటున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు.

అంతేకాదు, లాస్ట్ లో బంగారం పోయినట్లుగా, దానికోసం పోలీస్ ఎంక్వైరీ అంటూ ట్రైలర్ ని ఆసక్తిగా మలిచారు. అల్లరి నరేష్ సినిమాల్లో ఉండే కామెడీ టైమింగ్ తో పాటుగా, హీరోయిన్ అందాలు కూడా ఈసారి సినిమాకి అడ్వాంటేజ్ అయ్యేలాగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లాస్ట్ లో వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. అది గుళ్లో పులిహోర టైప్ కాదు, ప్యారడైజ్ బిర్యాని విత్ ఎక్స్ ట్రా లెగ్ పీస్ తెలుసా అంటూ చెప్పిన డైలాగ్ హాస్యాన్ని పండిస్తోంది.

ఓవర్ ఆల్ గా ట్రైలర్ చూస్తుంటే పండగ వెళ్లిపోయినా కూడా పండగ వినోదాన్ని పంచే సినిమాలాగానే కనిపిస్తోంది. మరి చూద్దాం.. ఈ బంగారు బుల్లోడు సూపర్ హిట్ కొడతాడా లేదా అనేది.


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.