కాన్సెప్ట్ బాగుంది… కానీ టేకింగ్ డౌటే..!

అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ బంగారు బుల్లోడు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అనేక మార్లు వాయిదా పడుతూ వస్తుంది. గత ఏడాది ప్రారంభంలోనే ఈ మూవీ షూటింగ్ మొదలుకాగా కారణం ఏదైనా ఇంకా విడుదల కాలేదు. కాగా నేడు అల్లరి నరేష్ పుట్టిన రోజు సంధర్భంగా బంగారు బుల్లోడు మూవీ టీజర్ విడుదల చేశారు. ఇక టీజర్ ఒకప్పటి అల్లరి నరేష్ ని గుర్తు చేసింది. కామెడీ చిత్రాలకు బ్రాండ్ మార్క్ హీరోగా ఉన్న అల్లరి నరేష్ కామెడీ చిత్రాలు ఈ మధ్య అంతగా ఆడలేదు.

కానీ బంగారు బుల్లోడు మళ్ళీ తనకు పునర్వైభవం తెస్తుంది అనిపిస్తుంది. భారీ కమెడియన్స్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ చిత్రం తెరపై నవ్వులు పూయించడం ఖాయం అని అర్థం అవుతుంది. ఇక ఈ మూవీలో అల్లరి నరేష్ గోల్డ్ లోన్ సెక్షన్ లో పనిచేసే బ్యాంకు ఉద్యోగి అని తెలుస్తుంది. సొంత అవసరాల కోసం బ్యాంకు కస్టమర్స్ లాకర్స్ లో బంగారాన్ని వాడుకొనే బంగారు బుల్లోడుగా అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు.

Bangaru Bullodu Movie Teaser Review1

ఇక పల్లెటూరి నేపథ్యంతో సాగే కథలో పోసాని, ప్రవీణ్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, పృథ్వి వంటి కామెడీ గ్యాంగ్ వెండితెరపై నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతారని అనిపిస్తుంది. ఇక ఈ కామెడీ కథలో సీరియస్ అంశం…బంగారం దొంగతనం. దాన్ని కనిపెట్టడానికి వచ్చిన పోలీస్ అజయ్ ఘోష్ పాత్ర సీరియస్ గా ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తుంది. ఇక హీరోయిన్ పూజ ఝవేరి గ్లామర్ కూడా ఈ మూవీకి ఆకర్షణ అయ్యే సూచనలు కలవు. మొత్తంగా బంగారు బుల్లోడు మూవీతో ఒకప్పటి నరేష్ ని ఆయన గుర్తు చేస్తాడు అనిపిస్తుంది.


మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Share.