రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కి లైన్ క్లియర్!

బాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆమీర్ ఖాన్. తను నటించే ప్రతీ సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటుంటాడు ఈ హీరో. ఒక్కో సినిమా కోసం ఏళ్ల తరబడి పనిచేస్తుంటాడు. ఇదిలా ఉండగా.. కొన్నాళ్ల క్రితం ఈ హీరో మహాభారతం ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు టీమ్ ఈ కథపై వర్క్ కూడా చేసింది. ఈ ప్రాజెక్ట్ ని వెబ్ సిరీస్ గా రూపొందించాలనేది ఆమీర్ ఖాన్ ప్లాన్.

దీనికోసం ఐదేళ్ల సమయం కూడా కేటాయించాలని అనుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి ఆయన తప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ పై బీజేపీ దృష్టి ఎక్కువగా ఉంటోంది. ఆ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ బాలీవుడ్ హీరోలను టార్గెట్ చేస్తోంది. సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘తాండవ్’ సినిమాపై పలు కేసులు పెట్టి.. అమెజాన్ సంస్థ నుండి బహిరంగ క్షమాపణలు చెప్పించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘మహాభారతం’ ప్రాజెక్ట్ తీయడం కరెక్ట్ కాదని భావిస్తోన్న ఆమీర్ ఖాన్ తన ఆలోచనను విరమించుకున్నాడు.

నిజానికి ‘మహాభారతం’ అనేది దర్శకుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. ఎప్పటికైనా ఈ సినిమా తీసి తీరతానని చెప్పేవారు. కానీ ఇంతలో అమీర్ ఖాన్ అనౌన్స్ చేయడంతో ఇక రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ని వదులుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమీర్ ఖాన్ ఈ కథను వదిలేయడంతో రాజమౌళి ఎప్పటికైనా మహాభారతాన్ని సినిమాగా తీసే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.