పవన్ ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ రెడీ అయినట్టేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ ‘వకీల్ సాబ్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని దర్శకుడు వేణు శ్రీరామ్ అలాగే నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. ఇంకా ఈ చిత్రం షూటింగ్ 20శాతం మిగిలుంది. షూటింగ్ లకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ సభ్యులు భావించారు.

అయితే వ్యాక్సిన్ వచ్చే వరకూ షూటింగ్ ప్రారంభించే సమస్యే లేదని పవన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమేనట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రెండో పాటని కంపోజ్ చేసాడట. అలాగే టీజర్ కట్ కోసం కూడా టీం పనిచెయ్యడం మొదలుపెట్టారట. సెప్టెంబర్ 2న కచ్చితంగా ‘వకీల్ సాబ్’ నుండీ రెండో పాట గాని లేదా టీజర్ ను కానీ విడుదల చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.

Pawan Kalyan's Vakeel Saab Movie First Look Talk1

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే విషయం పై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదట శృతీ హాసన్ అంటూ ప్రచారం నడిచింది. కానీ ఆమె ఈ ప్రాజెక్టు లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదట. దాంతో ఇప్పుడు మరో హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో చిత్ర యూనిట్ సభ్యులు బిజీగా ఉన్నారని సమాచారం.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Share.