‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ కు ముహూర్తం ఫిక్స్..!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పన్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో రానా ఓ హీరోగా ఫిక్స్ అయ్యాడు. అయితే మరో హీరోగా ఎవరు నటిస్తున్నారు అనే విషయం పై చాలా చర్చనడిచింది. మొదట బాలకృష్ణ అన్నారు.. ఆ తరువాత రవితేజ ఫిక్స్ అన్నారు. మళ్ళీ అతను కాదు వెంకటేష్ అని కూడా అన్నారు. ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది.

ముందుగా పవన్.. ఈ ప్రాజెక్టు చెయ్యడానికి ఒప్పుకోలేదట. ఎందుకంటే.. క్రిష్ సినిమాకి డేట్స్ క్లాష్ వస్తుందేమో అని ఆయన భావించారు. కానీ ఇప్పుడు కన్విన్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ రీమేక్ కోసం పవన్ 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందట. రెండు షెడ్యూల్స్ లోనే ఈ చిత్రాన్ని ఫినిష్ చేసేలా దర్శకుడు సాగర్ చంద్ర బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేసాడట. అందుకే పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పినట్టు సమాచారం.

‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. దసరాకి ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Share.