బాలీవుడ్ ‘మాస్టర్’ కోసం.. వెతుకులాట

టాప్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మాస్టర్ జనవరి 13న విడుదలైన విషయం తెలిసిందే. ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ ను అందుకొని విజయ్ స్టామినాను బయట పెట్టింది. ఇక సినిమా తమిళనాడు అంతటా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లు అందుకున్నట్లు సమాచారం. ఇది ఆల్ టైమ్ రికార్డులలో అత్యదిక ఓపెనింగ్స్ అందుకున్న రెండవ సినిమా. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో కూడా మంచి ఓపెనింగ్స్ ను అందుకొని మిక్సీడ్ టాక్ తో ముందుకు సాగుతోంది.

అసలు మ్యాటర్ లోకి వెళితే ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ బాలీవుడ్‌లో రీమేక్ కోసం సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. కోలీవుడ్ సర్కిల్స్ నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం, మాస్టర్స్ హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ ఎండెమోల్ షైన్ మరియు సినీ 1 స్టూడియోలు భారీ ధరకు దక్కించుకున్నట్లు టాక్. విజయ్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ వారి స్టార్ డమ్ అండ్ నతనతోనే సినిమాకు ఎంతగానో హైప్ క్రియేట్ చేశారు.

మాస్టర్ సినిమాను ఇంకా బాగా తెరకెక్కించవచ్చని బాలీవుడ్ నిర్మాతలు సరైన కాంబినేషన్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మాస్టర్ గా విజయ్ చేసిన పాత్ర కోసం ఏ హీరోను సెలెక్ట్ చేసుకుంటారు అనేది బిగ్గెస్ట్ సస్పెన్స్. ఇక త్వరలోనే ఆ విషయంలో క్లారిటీ రానున్నట్లు సమాచారం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.