పెళ్లి చేసుకోబోతున్న మరో స్టార్ హీరో

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ గత కొన్నేళ్లుగా నటాషా దలాల్ తో డేటింగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నటాషాను అతను వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లు చాలా కాలంగా వైరల్ అవుతున్నాయి. అసలైతే గత ఏడాదిలోనే వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ గట్టిగానే వచ్చింది. ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యిందని కూడా అన్నారు. కానీ ఇంతలో లాక్ డౌన్ కారణంగా అన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ నెల 24న ముంబైలోని అలీబాగ్‌లో ఈ స్టార్ సెలబ్రెటీల వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వివాహం కేవలం 40 నుండి 50 అతిథుల సమక్షంలోనే జరగనుందట. అలీబాగ్‌ లోని బీచ్‌ కు ఎదురుగా ఉన్న మొత్తం రిసార్ట్‌ను పెళ్లి వేడుక కోసం బుక్ చేసుకున్నట్లు సమాచారం. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తిగా రెడీ చేసినట్లు సమాచారం.

తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లిని చాలా గ్రాండ్ గా చేయనున్నట్లు తెలుస్తోంది. జనవరి 22, 23, అలాగే 24 వరకు మొత్తం 3 రోజులు వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక బాలీవుడ్ సెలబ్రెటీల కోసం ముంబైలోని ఒక స్టార్ హోటల్ లో ప్రత్యేకమైన పార్టీని కూడా నిర్వహించనున్నారని సమాచారం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.