మొత్తానికి బన్నీ సినిమాని రీమేక్ చేయడానికి రెడీ అయిపోయారట..!

ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ‘అల వైకుంఠపురములో’ చిత్రం. అల్లు అర్జున్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్. మళ్ళీ ఈ స్థాయి హిట్ ను అల్లు అర్జున్ అందుకుంటాడో లేదో కూడా కచ్చితంగా చెప్పలేము. ఇప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లు ఆగలేదు. అయితే ఈ చిత్రం కథ విషయం పై విమర్శలు చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. అదే ‘అత్తారింటికి దారేది’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘అఆ’ ‘అజ్ఞాతవాసి’ లానే ‘అల వైకుంఠపురములో’ సినిమా ఉంది.. కేవలం పాటలు పెద్ద హిట్టవ్వడం వల్ల అలాగే సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటెర్టైనర్స్ చూస్తారు కాబట్టి ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది. సినిమా చూస్తున్నంత సేపు పాట ఎప్పుడొస్తుందా అనే ఎదురుచూసాము’ అంటూ కొందరు ఈ చిత్రం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు అనే వార్తలు వచ్చినప్పుడు అంతలా ఈ చిత్రంలో ఏముంది అని కొందరు విశ్లేషకులు కామెంట్స్ చేశారు.

Ala Vaikunthapurramuloo Movie Review3

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం రీమేక్ రైట్స్ 8 కోట్ల వరకూ పలికాయి. దీనికి దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని వారు ఒప్పుకున్నప్పటికీ.. అల్లు అరవింద్ మాత్రం ఒప్పుకోలేదట. ‘మనమే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేద్దాం’ అని పట్టుబట్టారట. దీంతో త్రివిక్రమ్, ‘హారిక అండ్ హాసిని’ వారు ఒప్పుకుని మొత్తానికి రీమేక్ చేయడానికి దిగొచ్చారట. ‘గీత ఆర్ట్స్’ వారు 25 శాతం ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు త్రివిక్రమ్ కలిసి 50 శాతం.. ఇక మరో బాలీవుడ్ ప్రొడ్యూసర్ మిగిలిన పెట్టుబడి పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అల్లు అరవింద్ హిందీలో మంచి గ్రిప్ సంపాదించుకున్న నిర్మాత కాబట్టి ఇంత భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. హీరో ఎవరనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Share.