బ్యాచ్ లర్ గా అఖిల్ మెప్పిస్తాడా..?

అక్కినేని అఖిల్ సినిమాలు చేస్తున్నా కూడా సరైన హిట్ ఇంతవరకూ పడలేదనే చెప్పాలి. ఇక బొమ్మరిల్లు సినిమాతో మంచి సక్సెస్ ఇచ్చి చాలాకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన డైరెక్టర్ భాస్కర్ ని నమ్ముకుని బ్యాచ్ లర్ గా బరిలోకి దిగుతున్నాడు. నిజానికి ఈ సినిమాని సంక్రాంతి కానుకుగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడటం వల్ల వచ్చే సమ్మర్ లో దీన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అఖిల్ బ్యాచ్ లర్ గా ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడని, యువత మెచ్చేలాగా, కుటుంబ విలువలు తెలిసేలా సినిమా ఉంటుందని చెప్తోంది చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ చాలా వేగవంతంగా జరుగుతోంది. జనవరి నెలాఖరు కల్లా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్లుగా చిత్రయూనిట్ చెపుతోంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అఖిల్ తో పాటుగా, బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు.

Most Eligible Bachelor Teaser will be out on 25th Oct

మంచి కమ్ బ్యాక్ మూవీగా ఇది సక్సెస్ అయితే, బొమ్మరిల్లు భాస్కర్ కి డేట్స్ ఇచ్చేందుకు పెద్ద హీరోలు సైతం సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. అంతేకాదు, గీతాఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ మరో రెండు సినిమాలకి అగ్రిమెంట్ రాసిటనట్లుగా కూడా తెలుస్తోంది. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా అఖిల్ సమ్మర్ లో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి. అదీ విషయం.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.