కొత్త దర్శకుడిపై కర్చీఫ్ లు!

టాలీవుడ్ లో కొత్త దర్శకులు, కాస్త టాలెంట్ ఉన్న వారికోసం నిర్మాతలు చూస్తున్నారు. సినిమా విడుదలైన తరువాత ఏ మాత్రం టాలెంట్ ఉందని అనిపించినా.. పిలిచి మరీ అడ్వాన్స్ లు చేతిలో పెడుతున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే దర్శకుడిలో విషయం ఉందని తెలిస్తే వారిపై దృష్టి పెడుతున్నారు. టీజర్, ట్రైలర్ రిలీజై ఆకట్టుకునే విధంగా ఉంటే వెంటనే లాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ కొత్త డైరెక్టర్ పై కర్చీఫ్ లు వేస్తున్నారు నిర్మాతలు.

గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుండి సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. గీతాఆర్ట్స్ నుండి చిన్న సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా కంటెంట్ ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. ఈ సినిమా టీజర్ వైవిధ్యంగా ఉండడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. రీసెంట్ గా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది సినిమాపై ఆసక్తిని మరింత పెంచిందనే చెప్పాలి.

దీంతో దర్శకుడు ఎవరని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ట్రైలర్ చూసి కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి గురించి ఎంక్వయిరీలు చేస్తున్నారు. సాధారణంగా గీతాఆర్ట్స్ లో సినిమా చేసి సక్సెస్ అందుకుంటే ఆ దర్శకులను గీతాఆర్ట్స్ అంత ఈజీగా బయటకి పంపదు. కానీ బయటకి వచ్చి సినిమాలు చేసిన వారు కూడా ఉన్నారు. అందుకే కౌశిక్ తో తమ బ్యానర్ లో సినిమాలు చేసే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.