ప్రభాస్ ని లెక్క చేయని అలియాభట్!

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. మార్కెట్ లో అతడి సినిమాలకు డిమాండ్ పెరిగింది. అతడి సినిమాలకు పోటీగా బాలీవుడ్ తారలు కూడా సినిమాలకు రిలీజ్ చేయడానికి భయపడే పరిస్థితి కలిగింది. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ఎలాంటి పోటీ లేకుండా విడుదలైంది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో బాలీవుడ్ తారలు ప్రభాస్ ని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమా జూలై 30న రిలీజ్ కానుందని తెలిసి కూడా.. అదే రోజు ఓ బాలీవుడ్ సినిమాను బరిలోకి దింపుతున్నారు.

ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూభాయ్’. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన చేసిన ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నిజానికి ‘రాధేశ్యామ్’ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. పైగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ నిరాశ పరిచింది. దీనిపై బాలీవుడ్ లో చాలా విమర్శలు వినిపించాయి. నార్త్ లో ప్రభాస్ క్రేజ్ పోతుందంటూ కథనాలు ప్రచురించారు.

‘రాధేశ్యామ్’ సినిమా విషయంలో భయపడాల్సిన పని లేదని భావించిన ‘గంగూభాయ్’ టీమ్.. ఇప్పుడు ప్రభాస్ సినిమాకి పోటీగా తమ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ‘గంగూభాయ్’ సినిమాపై అంచనాలు ఏర్పడడంతో బాక్సాఫీస్ వద్ద స్కోప్ ఉంటుందని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ భావిస్తున్నాడు. మరి ఈ రెండింటిలో ఏ సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి!

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.